Tution Teacher thrashed: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ టీచర్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలితో అనుచితంగా వ్యవహరించాడు. ఈ విషయం తెలుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహువా పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు నివసిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రవి విజయ్ కుమార్ అనే ట్యూషన్ టీచర్.. విద్యార్థినితో అనుచితంగా మెలిగాడు. ఆ తర్వాత బాధితురాల్ని పట్టించుకోలేదు. బాలిక.. నిందితుడ్ని నిలదీయడం వల్ల ఆమె మొబైల్‌ను పగలగొట్టాడు. చంపుతానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు తన అక్కకు జరిగిన దారుణాన్ని చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు.. ట్యూషన్ టీచర్‌తో గొడవకు దిగి నిందితుడిని చితకబాదారు. రోడ్డుపై లాక్కెళ్లి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మహువా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.