తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిరాశతో 'చేతబడి'ని ఆశ్రయిస్తోంది'.. కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు! - అగ్నిపథ్​ పథకం

Pm Modi On Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్.. నిరాస, నిస్పృహల్లో మునిగితేలుతుందని అన్నారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని పొందలేరని తెలిపారు.

Pm Modi comments on congress:
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : Aug 10, 2022, 10:09 PM IST

Pm Modi comments on congress: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ నెల 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్‌ నిరసన తెలపడాన్ని ఉద్దేశిస్తూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు 'చేతబడి'ని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని పేర్కొన్నారు.

ఓ జాతీయ వార్తా సంస్థతో మోదీ మాట్లాడుతూ.. 'నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారు. ఆగస్టు 5న కొందరు చేతబడిని ప్రచారం చేసే ప్రయత్నం చేయడం చూశాం. నల్లని వస్త్రాలు ధరిస్తే తమ వైరాగ్య కాలం ముగిసిపోతుందని వీరు భావిస్తున్నారు' అంటూ విమర్శించారు. తదుపరి మాట్లాడుతూ 'కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. వారు ఎన్ని మాయలు చేసినా, మూఢనమ్మకాలను విశ్వసించినా ప్రజలు వారిని తిరిగి విశ్వసించరు' అని అన్నారు.

పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కాంగ్రెస్ ఈనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేసింది. దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా అంతా నలుపు దుస్తులు ధరించి, నిరసన చేపట్టారు. పార్లమెంట్‌కు నలుపు దుస్తుల్లోనే హాజరయ్యారు. కాగా పోలీసులు అరెస్టులతో ఆ నిరసనలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు.

ఇవీ చదవండి:'ప్రధాని అభ్యర్థిగా నీతీశ్ కుమార్​'.. పీకే కీలక వ్యాఖ్యలు

నుపుర్​ శర్మకు ఊరట.. ఎఫ్ఐఆర్​లన్నీ దిల్లీకి బదిలీ

ABOUT THE AUTHOR

...view details