తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట దినకరన్​తో ఓవైసీ​ పొత్తు - ఏఐఎంఐఎం ఓవైసీ

అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్నారు టీటీవీ దినకరన్​. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరి పొత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

TTV Dhinakaran join Hands with Owaisi's AIMIM
తమిళనాట ఓవైసీతో దినకరన్​ పొత్తు

By

Published : Mar 8, 2021, 6:33 PM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీతో టీటీవీ దినకరన్​ చేతులు కలిపారు.

మైనారిటీ ఓట్లపై దినకరన్​కు చెందిన​ ఏఎంఎంకే దృష్టి సారించింది. డీఎంకే-కాంగ్రెస్​ కూటమి బలం కూడా మైనారిటీ ఓట్లే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసదుద్దీన్​ పార్టీకి మూడు సీట్లు కేటాయించింది ఏఎంఎంకే. వానియంబడి, కృష్ణగిరి, శంకరపురం నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం బరిలో దిగనుంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే 10-15 నియోజకవర్గాల్లో ఈ పొత్తు ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో 234 సీట్లకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:-చిన్నమ్మ నిర్ణయంపై దినకరన్ స్పందన

ABOUT THE AUTHOR

...view details