TTD Vaikunta Ekadasi Darshan Tickets 2023 in Online : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. వెంకటేశ్వరస్వామి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ (నవంబర్ 10) విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్న.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(ఎస్‌ఈడీ)ను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. భక్తులు ttddevasthanam.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
మధ్యాహ్నం శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల: అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున.. 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచనుంది.
శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం: లోక సంక్షేమం కోసం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం లక్ష కుంకుమార్చన కనులపండువగా నిర్వహించారు. పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలకు ముందు రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం ఏడు గంటలకు ఉత్సవమూర్తిని వేంచేపుగా ముఖమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి పూజ చేశారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాలని కోరుతూ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య అంకురార్పణ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి చిన్నశేష వాహనసేవ జరగనుంది.
TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!