When Tirumala Seva tickets Release : తిరుమల ఏడుకొండలపై కొలువైన ఆ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచీ తరలివస్తుంటారు. కాలి నడకన కొండెక్కి.. స్వామి దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుందంటే.. కలియుగ దైవానికి భక్తులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. స్వామివారిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో పలురకాల టికెట్లను నేటి నుంచి విడుదల చేయబోతోంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎలక్ట్రానిక్ డిప్ కోటా..
Seva Electronic Dip TTD 2023 :
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయబోతోంది. ఇవి నంబర్ నెలకు సంబంధించిన టికెట్లు. ఇవి 19 ఆగస్టు 2023న శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. 21 ఆగస్టు 2023 సోమవారం ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.
TTD Varalakshmi Vratham Tickets : తిరుమలలో వరలక్ష్మీ వ్రతం.. టికెట్లు విడుదల.. బుక్ చేసుకోండిలా
ఇంకా మరిన్ని సేవల టికెట్లు..
మరికొన్ని రకాల సేవల టికెట్లను కూడా టీటీడీ రిలీజ్ చేస్తోంది. ఆర్జిత సేవలైన.. సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ, కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను కూడా విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ టికెట్లు ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
అంగ ప్రదక్షిణ కోటా..