తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TTD Tirumala Seva Tickets for December : డిసెంబర్​లో తిరుమల వెళ్లే వారికి గుడ్​న్యూస్​.. శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల.! - డిసెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Special Darshan Tickets For December : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించిన.. దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదులు బుక్ చేసుకునేందుకు వీలుగా.. షెడ్యూల్ వచ్చేసింది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 3:58 PM IST

Tirumala Special Darshan Tickets For December 2023 : తిరుమల ఏడుకొండలపై కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచీ తరలివస్తుంటారు. కాలి నడకన తిరుమల కొండెక్కి.. స్వామి దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు స్వామివారిని.. మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అలాగే ప్రతినెల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు రిలీజ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్​లైన్​లో బుక్ చేసుకునేందేకు టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది.

Tirumala Arjitha Seva Tickets : తిరుమల కొండపై శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన పలు రకాల టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్(Seva Electronic Dip TTD 2023)రిజిస్ట్రేషన్ ఈ నెల 18 నుంచి 20 వరకు కొనసాగింది. ఈ సేవలను పొందడానికి భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లక్కీ డిప్​లో టికెట్లు పొందిన వారు ఈ నెల 20 నుంచి 22లోపు వాటికి సంబంధించిన చెల్లింపులు చేసి బుకింగ్​లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్​.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ​..!

Tirumala Tirupati Devasthanam :అదే విధంగా డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన ఊంజల్ సేవ, కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. అలాగే, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా దర్శన కోటా టికెట్లను ఈ నెల 21న సాయంత్రం 3 గంటలకు విడుదల చేశారు.

ఈనెల 24న తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల :శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు ఈ నెల(సెప్టెంబరు) 23న జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 24న స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. tirupatibalaji.ap.gov.inవెబ్‌సైట్‌ ఓపెన్ చేసి... దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?

అదే విధంగా ఈనెల 25న తిరుపతిలో గదుల కేటాయింపు (Tirumala Accommodation Rooms Release), 26న తిరుమలలో గదుల కేటాయింపు స్లాట్లను విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాలను గమనించి పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

Tirumala Brahmotsavalu Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏయే రోజుల్లో ఏయే వాహన సేవంటే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details