TTD Tirumala Brahmotsavam October Schedule :ఈ ఏడాది అధిక మాసం కారణంగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే.. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో సంవత్సరం అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కన్యామాసం(భాద్రపదం)లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దసర నవరాత్రుల్లో(ఆశ్వయుజం) అఖిలాండ నాయకునికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే తిరుమలలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Salakatla Brahmotsavam) అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
ఇక తదుపరి నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం సిద్ధమవుతోంది. అక్టోబర్లో జరిగే ఈ బహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఇంతకీ బహ్మోత్సవాలు అంటే ఏమిటి? వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తేడా ఏంటి? అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలుకానున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
TTD Tirumala Brahmotsavam :పురాణాల ప్రకారం తిరమల శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే వేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavam)ను నిర్వహించారట. అందువల్లే అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది ఆనాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది అధికమాసం కారణంగా భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు గానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
TTD Tirumala Navarathri Brahmotsavam Dates 2023 :ఇప్పటికే సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ.. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏ రోజు ఏ పూజా కార్యక్రమం జరగనుందో ఇప్పుడు చూద్దాం..