TTD Governing Council Meeting: తిరుపతిలోని టీటీడీ(Tirumala Tirupati Devasthanam) సత్రాల స్థానంలో 418 కోట్ల రూపాయలతో అచ్యుతం, శ్రీపదం అతిధి భవనాల నిర్మాణానికి టెండరు ఖరారు చేశామని, ఝార్ఖండ్ రాష్ట్రంలో దేవగర్లోని 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (TTD Chairman Bhumana Karunakara Reddy) తెలిపారు. ఈ రోజు స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. సమావేశం ముందు గోవింద నామకోటి పుస్తకాలు, ఐదు భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. దీంతోపాటు స్థానిక ఆలయాల చిత్రాలతో కూడిన క్యాలెండర్లను భూమన కరుణాకరరెడ్డి విడుదల చేశారు. లడ్డూ పోటులో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10 వేల రూపాయల వేతనం పెంపునకు ఆమోదం తెలిపారు.
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్- డిసెంబర్ 19న స్వామి వారి దర్శనం నిలిపివేత!
Key Decisions Taken in TTD Board Meeting: అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ఇచ్చే ఆర్థిక సాయంలో మరో 60 లక్షలు, 40 లక్షల చొప్పున అదనంగా పెంచుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా పీఠాధిపతుల సమావేశం నిర్వహించి వారి సూచనలు తీసుకుని పాటిస్తామన్నారు. గురువారం 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
జనవరి నెల మొదటి వారంలో 1,500 టీటీడీ ఉద్యోగులకు పట్టాలు ఇస్తామన్నారు. విశ్రాంత ఉద్యోగుల కోసం 85 కోట్ల రూపాయలతో 350 ఎకరాలు కొనుగోలు చేసి 3,500 మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తామన్నారు. 6.15 కోట్ల రూపాయలతో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండర్ ఖరారు చేశామన్నారు. 7.31 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ ఖరారు చేయగా 7.24 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద పార్కింగ్ స్థల అభివృద్ధికి టెండర్ ఖరారు చేశామన్నారు.
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని టీటీడీ సత్రాల స్థానంలో 418 కోట్ల రూపాయలతో అచ్యుతం, శ్రీపదం అతిధి భవనాల నిర్మాణానికి టెండరు ఖరారు చేశాం, ఝార్ఖండ్ రాష్ట్రంలో దేవగర్లోని 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాం. డిసెంబర్ 28న 3వేల 5 వందల 18 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణి చేస్తాం. లడ్డు పోటులో పని చేసే కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10 వేల రూపాయల వేతనం పెంచుతాం. -భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ ఛైర్మన్
టీటీడీలో ఉద్యోగాలు - ఎంపికైతే భారీగా వేతనాలు!
TTD Board Meeting: 6.32 కోట్ల రూపాయలతో వరాహస్వామి అతిధి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు నాలుగులైన్లు రోడ్డు నిర్మాణానికి టెండర్ ఆమోదం చేసినట్లు తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు 300 రూపాయలకే సుపథం దర్శనం పొందే సౌలభ్యం కల్పించామన్నారు.తిరుపతిలో పారిశుద్ధ్యం నిర్వహణపై కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని భూమన కరుణాకరరెడ్డి వివరించారు.
తిరుమలలో డిసెంబర్ ఉత్సవాల లిస్టు ఇదే - ఆ 10 రోజులు దర్శనాలు రద్దు!