TTD Chairman Bhumana Karunakar Reddy comments: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భక్తులకు, దుకాణాల యజమానులకు, వన్యప్రాణులకు ఆహారం ఇచ్చేవారికి పలు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా అలిపిరి కాలినడక మార్గంలో జరిగిన చిరుత దాడిని దృష్టిలో ఉంచుకుని.. భక్తుల ప్రాణ రక్షణం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామన్న భూమన.. ఇక నుంచి కనుమ రహదారుల్లో జంతువులకు ఆహారం పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మెట్ల మార్గంలో చెత్త వేసే దుకాణాల యాజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా, ప్రతి 30 మీటర్ల దూరానికి వెలుతురు కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లతో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని..ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు.
Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత
12 years old children are allowed from 5 am to 2 pm: ''మెట్ల మార్గంలో కంచె (ఫెన్సింగ్) ఏర్పాటుకుతితిదే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీశాఖకు ప్రతిపాదనలు పెట్టాము. అయితే, ఏం చేయాలన్నా అటవీశాఖ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. అలాగే, మెట్ల మార్గంలో వచ్చే భక్తులను అప్రమత్తం చేయనున్నాం. దారిపొడవునా సూచిక బోర్డులు, లఘుచిత్రాలు ప్రదర్శించనున్నాం. ఇకపై 12 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తాం. పెద్దలకయితే రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తాం. అటవీశాఖలో సిబ్బంది నియామకానికి అవసరమైన నిధులను తితిదే సమకూరుస్తుంది. దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను కాలినడక మార్గంతో పాటు ఏ దారిలో వచ్చినా అనుమతిస్తాం.'' అని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు.