TTD Cancels Privileged Darshans for Navaratri Brahmotsavams in Tirumala : తిరుమల క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తుంటారు భక్తులు. ఆ స్వామి వారిని కనులారా దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది ఏడు కొండలు ఎక్కుతుంటారు. ఇప్పుడు దసరా నవరాత్రుల సమయం కావడంతో.. భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..
Navaratri Brahmotsavams in Tirumala :తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబరు 15 నుంచి 23 వరకు వేంకటేశ్వర స్వామి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, అక్టోబర్ 23వ తేదీన చక్రస్నాన మహోత్సవం వంటి ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక, వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Leopard Trapped in Cage Tirumala : తిరుమలలో ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత
ప్రత్యేక దర్శనాలు రద్దు..
TTD Cancels Privileged Darshans for Navaratri Brahmotsavams :దసరా నవరాత్రి ఉత్సవాల వేళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. పలు ప్రత్యేక దర్శనాలన రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నారు. ఇంకా.. ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది, సీనియర్ సిటిజన్, శారీరక వికలాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.