TSRTC Special Buses to Vijayawada For Dasara 2023 : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండుగల్లో దసరా ఒకటి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు, చదువుకునే వారు అందరు పండుగకు సొంత ఊరికి వెళ్లాలనుకుంటారు. అందుకోసం కొందరు రైలు మార్గాన్ని ఆశ్రయిస్తే.. మరికొందరు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఊళ్లకు వెళ్తారు. దీంతో.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి విజయవాడకు 24 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Tsrtc Special Bus Booking :ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి విజయవాడ వెళ్లాలనుకునే వారికోసం ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం 24 సర్వీస్‌లను కేటాయించింది. బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ (MGBS) నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయంచింది. ఆ సర్వీసులు కేపీహెచ్‌బీ (KPHB) కాలనీ, బాలానగర్, బోయిన్‌పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి.
Tsrtc Special Buses : ఈప్రత్యేక సర్వీస్‌లలోటిక్కెట్ ఛార్జీలో కూడా ఎలాంటి మార్పూ ఉండదని తెలంగాణ ఆర్‌టీసీ తెలిపింది. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్, వాటి పరిసరాల్లో నివసించే ప్రయాణికులు ఈ బస్సుల కోసం ఎంజీబీఎస్‌కు రావాల్సి వస్తోంది. దీంతో.. వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేబీఎస్ నుంచి బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్వీసుల వల్ల బోవెన్‌పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ఉండే వారికి ఎంతగానో ఉపయోగపడతాయని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సేవల కోసం వినియోగించడానికి tsrtconline.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది.