తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేపర్ లీక్ కేసు.. సిట్ ముందుకు TSPSC ముఖ్యులు - tspsc secretary questioned in paper leak case

TSPSC Secretary and Member Questioned by SIT: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో.. సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు సభ్యుడు లింగారెడ్డిని అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇద్దరి వాంగ్మూలం నమోదు చేసిన సిట్‌.. అవసరముంటే ఇతర సభ్యులతోపాటు.. ఛైర్మన్‌కి నోటీసులిచ్చి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

TSPSC paper leak case
TSPSC paper leak case

By

Published : Apr 1, 2023, 9:07 PM IST

పేపర్ లీక్ కేసు.. సిట్ ముందుకు.. TSPSC ముఖ్యులు

TSPSC Secretary and Member Questioned by SIT: పేపర్ లీకేజ్ కేసులో ఇన్ని రోజులపాటు నిందితులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులను విచారించిన సిట్.. తాజాగా కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు సభ్యుడు లింగారెడ్డిని విచారించింది. కేసు నిందితులు ప్రవీణ్, రమేశ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అనిత రామచంద్రన్‌ని విచారించగా.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బోర్డు సభ్యుడు లింగారెడ్డిని సిట్ అధికారులు విచారించారు.

టీఎస్‌పీఎస్సీలో ఒప్పంద ఉద్యోగుల నియామకాలు ఏవిధంగా చేపట్టారనే అంశంపై వివరాలు సేకరించినట్లు సమాచారం. నియామకాల్లో ఛైర్మన్, కార్యదర్శి , బోర్డు సభ్యుల పాత్ర ఏ మేరకు ఉంటుంది.. పోటీ పరీక్షలకు చెందిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఎలా జరుగుతుంది.. ఎన్నిరకాల ప్రశ్నపత్రాలు తయారుచేస్తారు..? అవి ఎవరి ఆధీనంలో ఉంటాయనే అంశంపై వివరాలు అనితా రామచంద్రన్‌ నుంచి సిట్ అధికారులు సేకరించారు.

బోర్డు సభ్యుల పాత్ర ఎలా ఉంటుందనే అంశం: పోటీపరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాల పత్రాలన్ని.. బోర్డు చైర్మన్ ఆధీనంలో ఉంటాయని అనితా రామచంద్రన్ చెప్పినట్లు సమాచారం. ఛైర్మన్ కంప్యూటర్‌లోనే అన్ని ఉంటాయని.. అందులో బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదని సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. పొరుగుసేవల ఉద్యోగుల నియామకాల్లో బోర్డు సభ్యుల పాత్ర ఎలా ఉంటుందనే అంశంపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రెండు గంటల పాటు లింగారెడ్డి విచారణ: మధ్యాహ్నం రెండు గంటల పాటు బోర్డు సభ్యుడు లింగారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. లింగారెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న రమేశ్‌కి.. ఆయనకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న అంశంపై వివరాలు సేకరించారు. రమేశ్‌ గ్రూప్-1 పరీక్ష రాస్తున్న విషయం తెలుసా అని.. లింగారెడ్డి నుంచి ఆరా తీరారు. పరీక్ష రాయడం.. ఫలితాలు వచ్చిన తర్వాత అయినా ఆ విషయం తెలిపారా లేదా అనే కోణంలో వివరాలు తెలుసుకున్నారు. ఎన్నిరోజులుగా అతను వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాడనే విషయాలను అడిగిన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏ-10 షమీమ్, ఏ-11 సురేష్, ఏ-12 రమేశ్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ ముగ్గురి ఇళ్లలో ఇప్పటికే సోదాలు చేసి.. గ్రూప్-1 మెటీరియల్, ల్యాప్‌టాప్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ప్రశ్నపత్రం ప్రవీణ్ నుంచే వచ్చినట్లు నిర్దారించుకున్నారు. ముగ్గురి కస్టడీ విచారణ ఆదివారంతో ముగియనుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో ఇప్పటికే వంద మందిని పిలిపించి పూర్తి వివరాలు సేకరించారు. శుక్రవారం నుంచి రెండోసారి పిలిచి విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ తెప్పించి.. వారితో పరీక్ష రాయించినట్లు తెలుస్తోంది. సుమారు 25 మంది అభ్యర్థులు సిట్ కార్యాలయానికి వచ్చి పరీక్ష రాసినట్లు సమాచారం.

ఇవీ చదవండి:'పేపర్ లీక్ కేసు.. సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జి విచారణ కావాలి'

DATA చోరీ కేసు.. వినయ్‌ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం

'ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. రాష్ట్రపతి పాలనకు కుట్ర'.. జైలు నుంచి రాగానే సిద్ధూ ఫైర్

ABOUT THE AUTHOR

...view details