Accused used chat GPT to cheat in TSPSC Exams :సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్ నిర్దారించింది. ఏఈఈ, డీఏఓ పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యరులతో ఒప్పందం కుదుర్చుకొని.. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యరులకు సమాధానాలు చేరవేసినట్టు సిట్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకు ఓఎగ్జామినర్ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
ఇప్పటి వరకు కేవలం ప్రశ్నపత్రాలు విక్రయించి మాత్రమే సొమ్ము చేసుకున్న కేసులో తొలిసారిగా నిందితులు.. ఎలక్ట్రానిక్ డివైజ్ పరికరాలను ఉపయోగించటం సంచలనంగా మారింది. విద్యుత్ శాఖ డీఈ రమేశ్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరో 20 మంది అభ్యరులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
Accused used chat GPT to cheat in AEE Exam : టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ సురేశ్‌తో పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌కు పరిచయం ఉంది. ప్రవీణ్ తన చేతికి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు వచ్చాక సురేశ్‌ను దళారీగా మార్చాడు. ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలను సురేశ్ 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. సురేశ్ ద్వారా డీఈ రమేశ్ కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు తెలుస్తోంది. ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు కావాలంటూ మరికొందరు అభ్యర్ధుల నుంచి ఒత్తిడి రావటంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రమేశ్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమాధానాలు చేరవేసేలా ఏడుగురు అభ్యరుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.20-రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.