తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC Paper Leak Case Update : సిట్​ నివేదిక తర్వాతే ఆ పరీక్షల ఫలితాలు - ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​

TSPSC Paper Leak Case Update : టీఎస్​పీఎస్సీ నిర్వహించిన మూడు పరీక్షల ఫలితాలకు సంబంధించి కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫలితాలను సిట్ నివేదిక వచ్చిన తర్వాతే విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పుడు కనుక ఫలితాలు వెల్లడించి.. తుది జాబితాకు ప్రకటించి.. ఎంపికలు ప్రారంభిస్తే న్యాయ ఇబ్బందులు తప్పవనే భావనంలో కమిషన్ ఉన్నట్లు కనిపిస్తోంది. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును సిట్​ విచారిస్తున్న సందర్భంగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

TSPSC
TSPSC

By

Published : May 30, 2023, 8:21 AM IST

TSPSC Paper Leak Case Update :టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైనప్పటి నుంచి ఇప్పటి వరకు కమిషన్​ నిర్వహించిన మూడు పరీక్షలకు ఇప్పుడు ఆటంకం తప్పడం లేదు. ఆ పరీక్షలు రాసి తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఇంకా కొన్నాళ్లు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే కేసును సిట్​ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా.. ఈ సమయంలో ఫలితాలు వెల్లడించడం.. తుది ఎంపిక చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్​పీఎస్సీ కమిషన్​ భావిస్తోంది. ఇందుకు సాంకేతిక, న్యాయ ఇబ్బందులూ తలెత్తే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచి ఉండాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. అసలు నిందితులు ఏఏ ప్రశ్నపత్రాలు లీక్​ చేశారు? వాటిని ఎంత మందికి కొనుగోలు చేశారనే విషయంపై సిట్​ దర్యాప్తును చేస్తోంది.

TSPSC delayed Exam results due to Paper leak : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకు ముందు గతేడాది జూలైలో ఐపీఎంలో 24 పోస్టులకు సంబంధించి కమిషన్​ ప్రకటనను విడుదల చేసింది. ఆ తర్వాత 16,381 మంది ఉద్యోగార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి అదే ఏడాది నవంబరులో రాత పరీక్షను నిర్వహించారు. డిసెంబరులో మెరిట్​ జాబితాను కూడా ప్రకటించారు. ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీఎస్​పీఎస్సీ కూడా ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన అనూహ్య కారణాల వల్లగ్రూప్​-1 పోస్టుల భర్తీలో మహిళలకు పురుషులతో పాటు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని గ్రూప్​నకు ప్రిపేర్​ అయ్యే మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

అందుకు హైకోర్టు వెంటనే గ్రూప్​-1లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్​ను ఆదేశించింది. అదే విధంగా పోలీసు శాఖలోనూ మొదటి నుంచి ఇదే విధానం అమలవుతున్నందున అన్ని నియామకాల్లోనూ ఇదే పద్ధతిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంత జాప్యం ఉండడంతో ఐపీఎం పోస్టుల ఫలితాలు ఆలస్యం. ఇప్పుడు టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో వీటి తుది జాబితా ప్రకటన మరింత ఆలస్యం అవుతుందని కమిషన్​ వెల్లడించింది.

SIT Investigation in TSPSC Paper Leak :మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఈ పోస్టులకు సంబంధించి గతేడాది ఆగస్టు, సెప్టెంబరులోనే కమిషన్​ రెండు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించారు. ఈ విభాగంలో 23 సీడీపీవో, శిశు సంక్షేమాధికారుల పోస్టులకు 19,184 మంది, 181 గ్రేడ్​-1 విస్తరణ అధికారుల పోస్టులకు 26,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షకు ప్రాథమిక కీ కూడా విడుదలైయింది. తుది కీ జారీ చేసి.. ఇంకా మెరిట్​ జాబితాను ప్రకటించాల్సి విషయమే ఆఖరు.

వీలైనంత త్వరగా సీబీఆర్‌టీ పరీక్షల ఫలితాలు : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ తర్వాత కమిషన్​.. మిగిలిన పరీక్షలను, రీషెడ్యూలు అయిన పరీక్షలకు కంప్యూటర్​ ఆధారిత రాత పరీక్ష (సీబీఆర్​టీ) నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పారదర్శకతతో పాటు.. ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. సిట్​ దర్యాప్తుతో సంబంధం లేని రాత పరీక్షలకు సీబీఆర్​టీ పరీక్షలు పూర్తి అయిన నెల నుంచి 45 రోజుల్లోగా మెరిట్​ జాబితాను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అంతే వేగంగా 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. తుది జాబితాను వేగంగా ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details