TSPSC Group 1 prelims Primary Key Release Today : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ ఉంచింది. జులై 1నుంచి జులై 5 వరకు ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని కమిషన్ చెప్పింది. అందుకే ఆన్లైన్లో ఆంగ్లంలో వచ్చిన అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో.. ఈ గ్రూప్1 అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లును కమిషన్ ఉంచింది. 2,33,056 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ ఓఎంఆర్ షీట్లు జులై 27 వరకు వెబ్ సైట్లో ఉంచనున్నట్లు పేర్కొంది.
TSPSC Group 1 prelims Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్.. ప్రాథమిక కీ విడుదల
20:00 June 28
TSPSC Group 1 prelims Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్.. ప్రాథమిక కీ విడుదల
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరగాల్సిన గ్రూప్1 పరీక్ష.. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 11న టీఎస్‌పీఎస్సీ పక్బంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSPSC Group 1 Exam Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమరీ ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. త్వరలోనే ప్రిలిమరీ ఫలితాలు విడుదల చేయనుంది. ఈ క్రతువును జులై తో ముగించనున్న టీఎస్‌పీఎస్సీ.. ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం ఇచ్చి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలల్లో గ్రూప్-1 ప్రధాన పరీక్ష ఉండనున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఇతర పరీక్షలు ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 పరీక్షను గతంలో రాసిన దానికంటే 50 వేల మంది తక్కువ రాసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం గ్రూప్-2,4 పరీక్షలకు సన్నద్ధం కావడంపై దృష్టి సారించడంతో ఈ పరీక్షను రాయలేదని అధికారులు భావిస్తున్నారు.
Group 1 Mains Exam In October or November : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత కమిషన్ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. కమిషన్లో ఎవరైనా పరీక్ష రాస్తే.. వారికి నిర్బంధ సెలవులు ఇవ్వాలని తీర్మానించింది. గ్రూప్-1 పరీక్షలో భద్రతా పరమైన కీలక అంశాలను ఎందుకు విస్మరించారని.. హైకోర్టు టీఎస్పీఎస్సీని వివరణ కోరింది. బయో మెట్రిక్ తీసుకోకపోవడం, ఓఎంఆర్ షీట్లో ఫొటో, సంతకం లేకపోవడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. గత అక్టోబరులో ఉన్న నిబంధనలు ఇప్పుడు ఎందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై మూడు వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
ఇవీ చదవండి :