తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TS HC Questions to APCID in Margadarsi Case: 'కోర్టు ఆదేశాలనూ పాటించరా?'.. ఏపీ సీఐడీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. - మార్గదర్శి వార్తలు

TS HC Questions to APCID in Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దాఖలైన కేసుల వివరాలను వెల్లడించడానికి మీడియా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ.. ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు బుధవారం నిలదీసింది. ప్రెస్‌మీట్లు ఎందుకు నిర్వహిస్తున్నారని, చందాదారులకు ఇబ్బంది ఉంటే వారు చూసుకుంటారని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటని ప్రశ్నించింది.

TS_HC_Questions_to_APCID_in_Margadarsi_Case
TS_HC_Questions_to_APCID_in_Margadarsi_Case

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 7:35 AM IST

TS HC Questions to APCID in Margadarsi Case:మార్గదర్శిపై నమోదైన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రధానంగా ఏపీ సీఐడీ అధికారులు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం పెట్టి వెల్లడించడాన్ని మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు వివరాలను మీడియాకు వివరించే అవసరం ఏమొచ్చిందని.. ఎవరైనా చందాదారులు ఫిర్యాదు చేశారా అని తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది.

Margadarsi Case Updates 'మార్గదర్శి’లో సోదాలు ఆపండి'.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ

దర్యాప్తు గురించి మార్గదర్శి ప్రశ్నించడం లేదని.. దాని గురించి మీడియాకు వెల్లడించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. మీడియాకు వెల్లడించడం వల్ల ఏం సాధించాలని అనుకున్నారని.. సీఐడీని ప్రశ్నించింది. మీడియా సమావేశాలపై నియంత్రణ ఉండాలని గత విచారణలోనే చెప్పినా పాటించరా అని నిలదీసింది. ప్రభుత్వ న్యాయవాదికి చెబితే అమలవుతుందని భావిస్తామని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌ ఉన్నపుడు నియంత్రణ అవసరమని, పిటిషన్లపై తేలేదాకా మీ అధికారులను నియంత్రించాలని.. ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.

High Court on Margadarsi Raids: "మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలి".. ఏపీ హైకోర్టు సూచన

మార్గదర్శి కేసులకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నామని తేల్చిచెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబరు 12కి వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

TS High Court Last Chance to AP Govt to File Counter in Margadarsi Case:మార్గదర్శిపై నమోదు చేసిన కేసులకు సంబంధించి ఆ సంస్థ, ఛైర్మన్, ఎండీ, సిబ్బంది దాఖలు చేసిన పలు పిటిషన్లపై.. జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ దశలో మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ జోక్యం చేసుకొని.. ఏపీ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, విచారణను మరికొంత ముందు చేపట్టాలని అభ్యర్థించారు.

AP CID Fourth Day Raids in Margadarsi Branches: కొనసాగుతున్న కక్ష సాధింపు.. నాలుగో రోజు మార్గదర్శి బ్రాంచ్​ల్లో సోదాలు

సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ జులై 20లోగా కౌంటర్లు దాఖలు చేయాలని.. ఈ కోర్టు ఆదేశించిందని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ..

చివరి అవకాశంగా గడువిస్తున్నామని, సెప్టెంబరు 12లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు తెలిపారు.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

Telangana High Court Fires on APCID: జోక్యం చేసుకున్న మార్గదర్శి తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నాగముత్తు.. దర్యాప్తు వివరాలను అధికారులు మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తున్నారని, దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్లు దాఖలు చేసిన తర్వాతే పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఇక్కడ ఉన్న అన్ని పిటిషన్లు తన పరిధిలో లేవని, కొన్ని కేసులను కొట్టివేయాలని కూడా వేశారని, వీటిపై తాను విచారించలేనని, కౌంటర్లు దాఖలు చేసిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నారని సీనియర్‌ న్యాయవాది మరోమారు చెప్పడంతో.. మీడియా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ అధికారంతో నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఫిర్యాదులు అందాయని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది జవాబిచ్చారు. దర్యాప్తు వివరాలు మీడియాకు వెల్లడించకుండా నియంత్రణలో ఉండాలని అధికారులకు చెబుతానని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేశాక అన్ని అంశాలను పరిశీలించి.. తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేశారు.

Margadarsi chitfunds updates: మార్గదర్శి చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

TS HC Questions to APCID in Margadarsi Case: 'కోర్టు ఆదేశాలనూ పాటించరా?'..

ABOUT THE AUTHOR

...view details