మహారాష్ట్రలోని ఆలయ నగరి షిర్డీలోకి రాకుండా మహిళా సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈనెల 11 వరకు నిషేధం విధించినట్లు స్థానిక సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ శిందే తెలిపారు.
షిర్డీకి రాకుండా తృప్తిదేశాయ్‌పై నిషేధం - తృప్తి దేశాయ్
సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్‌ను ఈనెల 11వరకు షిర్డీ సాయిబాబా ఆలయంలోకి రాకుండా స్థానిక సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ నిషేధం విధించారు. సాయిబాబా దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరుతూ ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని గతంలో తృప్తిదేశాయ్ హెచ్చరించారు.
11వరకు షిర్డీకి రాకుండా తృప్తిదేశాయ్‌పై నిషేధం
భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కోరుతోంది. ఈ మేరకు బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆ బోర్డులను తొలగించాలని తృప్తిదేశాయ్ గతంలో ట్రస్ట్‌ను హెచ్చరించారు.
ఇదీ చదవండి :కరోనా రిపోర్టు ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ