తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Attari border: ఎక్స్​రే అయితేనే అఫ్గాన్​ లారీలకు ఎంట్రీ! - అఫ్గాన్​ నుంచి వాణిజ్యం

అఫ్గానిస్థాన్​ నుంచి దేశంలోకి ప్రవేశించే ట్రక్కులను తనిఖీ చేసేందుకు అటారీ సరిహద్దులో(Attari border) దేశంలోనే తొలి రేడియేషన్​ డిటెక్షన్​ ఈక్విప్​మెంట్​(ఆర్​డీఈ) స్కానర్​ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువుల అక్రమ రవాణాను గుర్తించేందుకు ఎక్స్​రే కిరణాలను వినియోగించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దులోని మరో 7 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

Attari border
'ఆర్​డీఈ' స్కానింగ్​ వ్యవస్థ

By

Published : Sep 2, 2021, 6:23 PM IST

అఫ్గానిస్థాన్​ సహా పాకిస్థాన్​లోని తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్రం. ఈ క్రమంలోనే పంజాబ్​ అటారీ సరిహద్దులోని(Attari border) ఇంటిగ్రేడెట్​ చెక్​ పాయింట్​లో.. దేశంలోనే తొలి రేడియేషన్​ డిటెక్షన్​ ఈక్విప్​మెంట్​ను ఏర్పాటు చేసింది. అఫ్గాన్​ నుంచి వచ్చే ట్రక్కులను ఎక్స్​రే ద్వారా తనిఖీ చేపట్టనున్నారు.

అటారీ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఆర్​డీఈ స్కానింగ్​ వ్యవస్థ

"ఆర్​డీఈని పూర్తి ట్రక్కు స్కానర్​గా పిలుస్తారు. ట్రక్కులు ఆర్​డీఈ గుండా వెళ్లిన క్రమంలో అది స్కాన్​ చేస్తుంది. ఏవైన వస్తువులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలిస్తే.. ఎక్స్​రే కిరణాలు వాటిపై పడగానే ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. అలాగే రేడియోఆక్టివ్​ వస్తువులను సైతం ఇది కనిపెడుతుంది. అంతర్జాతీయ సరిహద్దుల గుండా రేడియోఆక్టివ్​ వస్తువులు, ఇతర పరికరాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రతా బలగాలకు ఎంతగానే ఉపయోగకరంగా ఉంటుంది."

- ఆదిత్య మిశ్రా, లాండ్​ పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఛైర్మన్​.

మరో ఏడు..

మరో ఏడు ఆర్​డీఈ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు మిశ్రా. అటారీ వాఘా సరిహద్దు, పాట్రోపాల్​, దావ్కి, అగర్తలా, సుతర్కాని(బ్లంగా సరిహద్దు), మొరేహ్​(మయన్మార్​ సరిహ్దదు), రాక్షాల్​, జోగ్బానీ(నేపాల్​ సరిహద్దు)లో ల్యాండ్​ పోర్ట్​ అథారిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే వీటికోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు.

ఆర్​డీఈ స్కానింగ్​ వ్యవస్థ

పాకిస్థాన్​తో వాణిజ్యం నిలిచిపోయినప్పటికీ, అఫ్గాన్​ ట్రక్కులు పాక్​ మీదుగా అటారీ సరిహద్దుల గుండా దేశంలోకి వస్తున్నాయి. ప్రతి రోజు సుమారు 30 ట్రక్కుల్లో డ్రైఫ్రూట్స్​, ఇతర పండ్లు అటారీ సరిహద్దుల నుంచి సరఫరా అవుతున్నాయి. భూమార్గాల ద్వారా.. నేపాల్​, బంగ్లాదేశ్​, మయన్మార్​, పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​(పాకిస్థాన్​ మీదుగా)లతో వాణిజ్యం కొనసాగిస్తోంది భారత్​. చైనాతో ఉపరితల రవాణా వాణిజ్యం లేదు.

ఇదీ చూడండి:అట్టారీ సరిహద్దులో భారీగా అక్రమ ఆయుధాల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details