ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్ చంద్రమణి చౌక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహారన్‌పుర్ నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ముగ్గురు బైకర్లపైకి దూసుకొచ్చింది. ఈ ఘటన పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బైకర్లలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు బైకర్లతో పాటు స్థానిక దుకాణదారుడు ఈ ఘటనలో గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
జనంపైకి దూసుకెళ్లిన ఎస్యూవీ..
బిహార్‌లో దారుణం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ఎస్యూవీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా.. తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తీపుర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిత్వార్‌పుర్‌లోని కన్హయ్య చౌక్ సమీపంలో.. ఓ మతపరమైన వేడుకలో భాగంగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వేగంగా వస్తున్న ఓ ఎస్యూవీ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.