తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు' - tripura CM tweet

విద్యార్థినుల ఆరోగ్యం కోసం త్రిపుర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 6-12 తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించనున్నట్లు ప్రకటించింది.

sanitary napkins
శానిటరీ న్యాప్కిన్లు, త్రిపుర సర్కారు

By

Published : Jun 11, 2021, 9:01 AM IST

ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించనున్నట్లు త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్​లాల్ నాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ట్వీట్ చేశారు.

విద్యార్థినుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రతన్​లాల్​ తెలిపారు. రూ.28-35 విలువ చేసే శానిటరీ న్యాప్కిన్​ ప్యాకెట్​ను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా దాదాపు 1.68 లక్షల మంది విద్యార్థినులు లబ్ధి పొందుతారని అంచనా. 4,940 ప్రభుత్వ పాఠశాలలు, 1,000 ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులకు ప్రభుత్వం సాయం చేయనుంది. ఈ మేరకు రూ.3.61 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఇదీ చదవండి:

రుతుస్రావంపై ఈ విషయాలు మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details