బంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న మమతా బెనర్జీ నిర్ణయాన్ని భాజపా నేత, త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ తప్పుపట్టారు. ఆమె పోటీ చేసిన స్థానంలో ఓడిపోయినప్పటికీ పదవి చేపట్టాలనుకోవడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమేనని అభిప్రాయపడ్డారు.
"ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ మమతా బెనర్జీ గెలవలేదు. ఆమెను ప్రజలు తిరస్కరించారు. ఆమె అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నా విషయంలో ఇలాగే జరిగితే.. రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రజలు నన్ను ఎన్నుకోలేదని పార్టీ హైకమాండ్‌కి చెప్పాను. అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు టీఎంసీ స్వేచ్ఛ కలిగి ఉంది."
-బిప్లబ్ కుమార్ దేవ్, త్రిపుర ముఖ్యమంత్రి.
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల వాటా గణనీయంగా పెరిగిందని బిప్లబ్ అభిప్రాయపడ్డారు. బంగాల్‌లో పార్టీ బలంగా పుంజుకుందన్నారు.
"మమతా బెనర్జీని ఓడించేందుకు కుట్ర జరిగిందని చెబుతున్నారు. ఓటమి ఒక కుట్రే అయితే.. ఎన్నికల్లో టీఎంసీ విజయం వెనుక కూడా అతిపెద్ద కుట్ర దాగి ఉంది"
-బిప్లబ్ కుమార్ దేవ్