తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసెంబ్లీలో పోర్న్ వీడియోస్​ చూస్తూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే! - బీజేపీ నాయకుడు జదబ్ లాల్ నాథ్ వార్తలు

త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే పట్టుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

tripura bjp mla watching porn in assembly
త్రిపుర అసెంబ్లీలో పోర్న్​ చూస్తు దొరికిన బీజేపీ ఎమ్మెల్యే

By

Published : Mar 30, 2023, 3:49 PM IST

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో త్రిపురలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఫోన్​లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. కాగా, చట్టసభలోనే పోర్న్​ వీడియోస్​ను చూసిన ఎమ్మెల్యే.. బీజేపీకి చెందిన జదబ్ లాల్ నాథ్​.

త్రిపుర రాజధాని అగర్తలాలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సమావేశాల రెండో రోజే రాష్ట్ర బీజేపీ ఎమ్యెల్యేగా ఉన్న జదబ్ లాల్ నాథ్ ఇలా సభలోనే పోర్న్​ వీడియోలు చూస్తూ కనిపించారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను ఎవరో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం వల్ల ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే టాబ్లెట్​ పట్టుకుని అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి చట్టసభల్లో ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్​ బిస్వా బంధు సేన్​ నుంచి ఎటువంటి స్పందన లేదు.

ప్రస్తుతం జీబేపీలో కొనసాగుతున్న జదబ్​ ఇంతకుముందు సీపీఎం పార్టీలో ఉన్నారు. 2018 ఎన్నికలకు ముందే ఈయన బీజేపీలో చేరారు. అదే ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై పోటీ చేశారు. జదబ్​ నాథ్​ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి, అసెంబ్లీ మాజీ స్పీకర్​ రామేంద్ర చంద్ర దేబ్​నాథ్​పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవలే త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన బాగ్​బాషా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారేమీ కాదు. ఇటువంటి ఉదంతాలు ఇంతకుముందు అనేకం జరిగాయి. అప్పడప్పుడు ఇతర దేశాల చట్టసభల్లోనూ ఇలాంటి సంఘటనలు జరుతుంటాయి.
పోర్న్​ చూసి..రాజీనామా చేసి..
పార్లమెంటులో పోర్న్​ వీడియోలు చూశారని తీవ్ర విమర్శలపాలైన బ్రిటన్ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ 65 ఏళ్ల నీల్​ పారిష్​​.. ఏకంగా తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది. ఓ ట్రాక్టర్ వెబ్​సైట్​ చూద్దామనుకుంటే అదే పేరుతో ఉన్న పోర్న్ సైట్ ఓపెన్ అయిందని, కాసేపు అది చూశానని స్వయంగా ఎంపీనే అంగీకరించారు. బ్రిటన్ పార్లమెంటు దిగువ సభలో కూర్చుని, మొబైల్​ ఫోన్​లో నీలి చిత్రాలు చూశారనే ఆరోపణల కారణంగా ఆయన తన పదవికే రాజీనామా చేశారు. సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఆయన రిజైన్​ చేయక తప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details