తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్తికి ఆశపడి భార్యకు ఫోన్​లోనే త్రిపుల్ తలాక్.. 3నెలలు పోలీసుల చుట్టూ తిరిగినా

త్రిపుల్​ తలాక్​ ​ విషయంపై కోర్టు ఇప్పటికే ఎన్నో తీర్పులిచ్చినప్పటికి దీని బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఝార్ఖండ్ ధన్​బాద్​కు చెందిన ఓ మహిళ ఇలాగే త్రిపుల్ తలాక్ బారినపడింది.

triple-talaq-case-in-dhanbad-husband-gave-triple-talaq-over-phone-for-second-marriage
triple-talaq-case-in-dhanbad-husband-gave-triple-talaq-over-phone-for-second-marriage

By

Published : Sep 13, 2022, 12:05 PM IST

triple talaq over phone : త్రిపుల్​ తలాక్​ బారిన పడే బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఝార్ఖండ్ ధన్​బాద్​కు చెందిన ఓ మహిళకు.. ఆమె భర్త ఫోన్​లో తలాక్ చెప్పాడు. ఆస్తి కోసం ఆశపడి ఆమె భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికి భార్య ఒప్పుకోదని తెలిసి.. ఫోన్​లోనే తలాక్ చెప్పాడు ఆ వ్యక్తి. అయితే, దీనిపై బాధితురాలు మూడు నెలలుగా న్యాయపోరాటం చేస్తోంది. తనకు ఎవరూ సహకరించడం లేదని వాపోయింది.

అసలేం జరిగింది: బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ధన్​బాద్ జిల్లా చస్నాలాకు​ చెందిన అదిఫా ఫాతిమాకు బంగాల్​లోని పురూలియా జిల్లాకు చెందిన అయూబ్ ఖాన్​తో 2016లో వివాహం జరిగింది. అతను బేకరీలో పని చేస్తుండేవాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు అయూబ్ ఖాన్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడని బాధితురాలి తండ్రి వివరించారు. ఆస్తికి ఆశపడే ఈ అన్యాయానికి పాల్పడ్డారని వాపోయారు.

ఈ నేపథ్యంలో, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, వారు తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నిరాశ చెందిన ఫాతిమా.. జిల్లా సీనియర్ ఎస్పీని ఆశ్రయించింది. ఆమె కంప్లైంట్​ను ఆధారంగా తీసుకున్న ఎస్​ఎస్పీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేశారు. అయితే మహిళ భర్త తన స్టేట్​మెంట్​ ఇచ్చేందుకు స్టేషన్​కు రాలేదని.. గడువు తేదీ ముగిశాక అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details