Triple Murder in Khunti: చుట్టంగా వచ్చి ఆ కుటుంబానికి చెందిన ముగ్గరిని హతమార్చాడో దుండగుడు. ఆ ఏ మాత్రం భయం లేకుండా మృతదేహాల పక్కనే రక్తపు మడుగులో కూర్చున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు హేమంత్ పురి స్వస్థలం ముర్హులోని గజ్‌గావ్. గత శుక్రవారం అతడి బంధువులైన బీత్నా ముండా ఇంటికి వచ్చాడు. బీట్నా కుటుంబ సభ్యులంతా పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత బీత్నా ముండా(65), అతని కుమారుడు సుదా ముండా(25), నిందితుడు హేమంత్ పరి, మరో బంధువు ఇంట్లో నిద్రపోయారు. బీత్నా మరో కుమారుడు సోమా ముండా, మరో బంధువు, నిద్రపోవడానికి అక్కడికి కొంత దూరంలో ఉన్న మరో ఇంటికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హేమంత్ పురి నిద్రలేచి.. ఇంట్లో పడుకున్న వారిని మద్యం మత్తులో పారతో కిరాతకంగా హతమార్చాడు. అనంతరం రక్తపు మడుగులో పార చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. ఉదయం పొలానికి వెళ్లే ముందు బీత్నా కుమారుడు సోమా ముండా ఇంటికి వచ్చాడు. మృతదేహాల మధ్య రక్తపు మడుగులో హేమంత్ పురిని చూసి భయపడిపోయాడు. వెంటనే ఊళ్లో వాళ్లను పిలిచాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని నిందితుడిని కట్టిపడేశారు.