త్వరలో బంగాల్లో భవానీపుర్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలకు అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ (mamata banerjee news) పేరును ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్. ఈ ఉపఎన్నిక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కీలకం కానుంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మమత.. ఇందులో గెలిస్తేనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా పనిచేసే వారు ఆ పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండటం ఇందుకు కారణం.
రాష్ట్రంలోని జంగీపుర్, సంసీర్గంజ్, భవానీపుర్లలో (bhabanipur election) సెప్టెంబరు 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. జంగీపుర్, సంసీర్గంజ్ల నియోజకవర్గాలకు తృణమూల్ అభ్యర్థులుగా జకీక్ హుస్సేన్, అమీరుల్ ఇస్లాం బరిలో నిలవనున్నారు.