తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నమ్మ నిర్ణయంపై దినకరన్ స్పందన - తమిళనాడు ఎన్నికల వార్తలు

రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు శశికళ తీసుకున్న నిర్ణయంపై ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్​ స్పందించారు. ఈ నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకునేలా ఎంతగానో ప్రయత్నించినట్లు తెలిపారు.

Tried my best to persuade Sasikala out of her decision, Says TTV Dhinakaran
'ఆమె నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఎంతో ప్రయత్నించాను'

By

Published : Mar 4, 2021, 5:28 AM IST

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు బుధవారం ప్రకటించారు. దీనిపై ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్​ స్పందించారు. శశికళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసేందుకు తన వంతుగా ఎంతోగానో ప్రయత్నించానని తెలిపారు.

చెన్నైలోని శశికళ నివాసం ఎదుట మాట్లాడిన ఆయన.. ఇంతకు ముందుగానే తాను శశికళను కలిసి వచ్చే ఎన్నికలపై చర్చించిట్లు పేర్కొన్నారు. ఇంతలోపై ఆమె రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారనే వార్తలను స్థానిక మీడియాలో చూసి తెలుసుకున్నట్లు వివరించారు. వెంటనే శశికళ ఇంటికి వచ్చి మాట్లాడినట్లు చెప్పారు.

అయితే తన పార్టీ ఏఎంఎంకే మాత్రం ఈ ఎన్నికల్లో యధాతథంగా బరిలో ఉంటుందని స్పష్టం చేశారు.

స్వాగతించిన భాజపా...

రాజకీయాలు, ప్రజాజీవితం నుంచి తప్పకొంటున్నట్లు ప్రకటించిన శశికళ నిర్ణయాన్ని భాజపా స్వాగతించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నిర్ణయం అత్యంత కీలకమైనదిగా అభివర్ణించింది.

ABOUT THE AUTHOR

...view details