తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్​ఘాట్​ వద్ద 'గాంధీ'కి మోదీ సహా ప్రముఖుల నివాళి - uttar pradesh cm on mahatma gandhi martyre event

మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు.. రాజ్​ఘాట్​ వద్ద నివాళులర్పించారు. మహాత్ముని ఆదర్శాలు లక్షలాది మందిని ప్రేరేపిస్తున్నాయని మోదీ తెలిపారు.

Tributes to the great Bapu
రాజ్​ఘాట్​ వద్ద 'గాంధీ'కి మోదీ సహా ప్రముఖుల నివాళులు

By

Published : Jan 30, 2021, 11:21 AM IST

Updated : Jan 30, 2021, 12:18 PM IST

మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా.. దిల్లీలోని రాజ్​ఘాట్​ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. మహాత్ముడికి నివాళులు అర్పించారు. మహాత్ముని ఆదర్శాలు.. లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయని మోదీ అంతుకుముందు ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

రాజ్​ఘాట్​ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

"మహాత్ముని ఆదర్శాలు.. లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. భారతీయుల శ్రేయస్సు కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకునే రోజు ఇదని ఆయన పేర్కొన్నారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ట్విట్టర్​ వేదికగా మహాత్మగాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు

మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహాత్ముడికి నివాళులు అర్పించారు.

నివాళులు అర్పిస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

"జాతిపిత చెప్పిన అహింస, నిరాడంబరత, వినయ విధేయతలకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ సత్యం, ప్రేమ అనే సన్మార్గాలను అనుసరించాలి."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ట్విట్టర్​ వేదికగా మహాత్మగాంధీకి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నివాళులు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్​ఘాట్​కు చేరుకొని గాంధీకి నివాళులు అర్పించారు.

నివాళులు అర్పిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"అణగారిన వర్గాల అభ్యున్నతికి గాంధీ అవిశ్రాంత కృషి చేశారు. బాపు జీవితం, ఆయన అనుసరించిన సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి."

-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ట్విట్టర్​ వేదికగా మహాత్మగాంధీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులుల
మహాత్ముడికి మోదీ సహా ప్రముఖుల నివాళులు

హజ్రత్​గంజ్​లోని గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్​.. మహాత్ముడికి నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్​

ఇదీ చదవండి:మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం

Last Updated : Jan 30, 2021, 12:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details