తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదివాసి యువతిపై ఏడాదిగా అత్యాచారం- గర్భంలోని శిశువును... - ఆదివాసి యువతిపై అత్యాచారం

ఓ ఆదివాసి యువతిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు పొరుగింటి వ్యక్తి. అంతేగాక ఆమె గర్భం దాల్చకుండా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. బాధితురాలు కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే అసలు విషయం బయటపడింది.

Tribal teen raped repeatedly, forcibly given abortion pills by accused in Raj's Jhalawar
యువతిపై ఏడాదిగా అత్యాచారం- గర్భం దాల్చకుండా మాత్రలు

By

Published : Oct 11, 2021, 6:34 PM IST

ఆదివాసి యువతిపై పొరుగింటి వ్యక్తి ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని నిందితుడు పలుమార్లు రేప్​ చేయడమేగాక.. ఆమె గర్భం దాల్చకుండా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. రాజస్థాన్​లోని ఝాలావాడ్​లో ఈ ఘటన జరిగింది. అయితే ఆమె వయసు 18 సంవత్సరాలు అని కుటుంబసభ్యులు చెబుతుండగా.. అది నిజమో కాదో నిర్ధరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ బాధితురాలు మైనర్ అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

అలా తెలిసింది..

బాధితురాలు శనివారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె 6 నెలల గర్భవతి అని చెప్పారు. నిందితుడు అబార్షన్ మాత్రలు ఇవ్వడం వల్ల పిండం మరణించిందని వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నిందితుడు దావూద్​పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.

బాధితురాలు భిల్ సామాజిక వర్గానికి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:తొమ్మిదో తరగతి విద్యార్థినిపై క్లాస్​మేట్​ సోదరుడు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details