Torture In Police Custody: పోలీసులు కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసినట్లు ఓ గిరిజనుడు ఆరోపించాడు. అందుకే తాను దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవాల్సి వచ్చిదని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన అధికారులు.. అతని ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ ఘటనలో బాధితుడికి న్యాయం జరగాల్సిందేనని ప్రతిపక్ష కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్, సీపీఐలు డిమాండ్ చేశాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇదీ జరిగింది..
కేరళ మీనంగడి సమీపంలోని అతికడవు పానియా గిరిజన కాలనీకి చెందిన దీపు అనే గిరిజన యువకుడు మీడియాతో మాట్లాడారు. నవంబర్ 5న ఓ కారు దొంగతనం కేసులో తనను పోలీసులు చిత్రహింసలకు (torture in custody) గురిచేశారని ఆరోపించారు. తప్పును అంగీకరించమని బలవంతం చేశారని తెలిపారు. తరువాత ఒక ఇంట్లో బైక్ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. దీపుకు అసలు కారు డ్రైవింగ్ రాదని.. అలాంటిది దొంగతనం ఎలా చేయగలతాడని అతని తరుఫు బంధువులు చెబుతున్నారు. ఇదంతా పోలీసుల కుట్రలో భాగమే అని పేర్కొన్నారు.
అయితే వయనాడ్ పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ సుకుమార్ ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు. నిందితులు డూప్లికేట్ కీ ఉపయోగించి కారును కొంత దూరం తీసుకుపోగా.. స్థానికులు పట్టుకున్నారని పేర్కొన్నారు.