Labourer finds diamond: ప్రపంచంలోకెల్లా ఆకర్షణీయమైన, నాణ్యమైన వజ్రాలు దొరికే మధ్యప్రదేశ్ రాష్ట్ర పన్నా గనుల్లో గిరిజన రైతుకూలీ ములాయం సింగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణ కల్యాణ్‌పుర్ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60లక్షలు విలువ చేసే 13.54 క్యారెట్ల వజ్రాయం ములాయం చేతికి చిక్కింది. దీంతోపాటే మరో ఆరు చిన్న వజ్రాలు ములాయంతోపాటు తవ్వకాలు జరుపుతున్న సహ కార్మికులకు దొరికాయి.
రాత్రికి రాత్రే లక్షాధికారైన రైతుకూలీ- ఒక్క వజ్రంతో...
Labourer finds diamond: రాత్రికి రాత్రే ఓ గిరిజన రైతుకూలీ లక్షాధికారిగా మారాడు. గనుల్లో పని చేసే అతనికి రూ.60లక్షలు విలువ చేసే ఓ వజ్రం(mine labourer finds diamond) దొరికింది. దీంతో అతను సంతోషంలో మునిగిపోయాడు.
రైతుకూలీకి దొరికిన వజ్రం
Panna diamond mines: ఒకేరోజు దొరికిన ఈ 7 వజ్రాల విలువ దాదాపు రూ.కోటి ఉంటుందని అంచనా. పన్నా గనులకు ఇది 'డైమండ్ డే' అని అధికారులు తెలిపారు. వేలంలో వీటి అసలు విలువ తెలుస్తుంది. ఈ డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటానని ములాయం చెప్పారు.
ఇవీ చూడండి: