తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్వర్టుతో బాలుడి వివాహం.. బొమ్మ బైక్​పై ఊరేగింపు.. ఎందుకో తెలుసా? - boy marriage with tree

బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించారు కుటుంబ పెద్దలు. ఝార్ఖండ్​లో ఈ అరుదైన వివాహం జరిగింది. ఎందుకు ఇలా వివాహం జరిపిస్తారంటే?

boy-married-with-culvert
boy-married-with-culvert

By

Published : Jan 18, 2023, 4:58 PM IST

ఝార్ఖండ్​లోని తూర్పు సింగ్భూమ్​లో అరుదైన వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయం ప్రకారం తమ కుమారుడికి కల్వర్టుతో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు అఖన్న జాతర జరుపుకొంటారు గిరిజనులు. ఈ సందర్భంగా.. చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం వీరికి సంప్రదాయంగా వస్తోంది. పిల్లలకు తొలి దంతం పైదవడకు వస్తే.. వారికి ఇలా వివాహం జరిపిస్తారు. లేదంటే అశుభం జరుగుతుందని గిరిజనులు నమ్ముతుంటారు. కల్వర్టు, చెట్టుకు వివాహం జరిపించకపోతే.. వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి భాగస్వామి వెంటనే మరణిస్తారని విశ్వసిస్తుంటారు. అందుకే, అలాంటి చిన్నారులకు ఐదేళ్ల వయసు వచ్చే లోపే కల్వర్టులు, చెట్లకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు.

బాలుడి ఊరేగింపు

ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్ సర్దార్.. తన మనవడికి వివాహం జరిపించారు. చిన్నారిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి.. బొమ్మ బైక్​పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడే వివాహ తంతు జరిపించారు. పెద్దలు చెప్పినట్లు తాము నడుచుకుంటున్నామని.. అశుభం జరగాలని తాము కోరుకోవడం లేదని సరీ సింగ్ చెబుతున్నారు. 'కింది దవడకు తొలి దంతం వచ్చినవారికి వివాహం ఏమీ జరిపించం. పైదవడకు వచ్చినవారికే.. ఇలా చేస్తాం. వారు అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. పెళ్లి జరిపిస్తాం' అని బాలుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఝార్ఖండ్​తో పాటు ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంప్రదాయాన్ని గిరిజనులు పాటిస్తున్నారు.

కల్వర్టుతో బాలుడి వివాహం

ABOUT THE AUTHOR

...view details