'రాక్షస్', '53', 'పోర్టుశ్'.. వీటిని చదువుతుంటే ఇవేవో సినిమా పేర్లు లాగా అనిపిస్తున్నాయి కదా. కానీ వాస్తవానికి ఇవన్నీ రెస్టారెంట్ పేర్లు. బిహార్ పట్నా వీధుల్లో తిరిగే ప్రజలకు ఇలాంటి బోర్డులు విరివిగా కనిపిస్తాయి. కమ్మనైన ఆహారాన్ని కోరుకునే ఫుడ్ లవర్స్‌ను మరింత అట్రాక్ట్ చేసేందుకు అక్కడి కేఫ్ యజమానులు తమ షాపులకు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు.
'రాక్షస్', '53'.. సిటీలో కేఫ్‌ల నేమ్స్ వెరీ క్రేజీ గురూ.. భలే వింతగా ఉన్నాయిగా! - పట్నా లేటెస్ట్ అప్డేట్స్
ప్రస్తుత రోజుల్లో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు తమ రెస్టారెంట్లు, కేఫ్‌లకు యజమానులు ఆకర్షణీయంగా ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కానీ బిహార్‌లోని పట్నా సిటీలోని వ్యాపారులు మాత్రం విచిత్రమైన పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ సారి ఆ పేర్ల సంగతేంటే చూసేద్దాం రండి.
పట్నాకు చెందిన ఆకాశ్ అనే వ్యక్తి తాను కొత్తగా మొదలుపెట్టే రెస్టారెంట్‌కు కాస్త వెరైటీగా పేరు పెట్టాలని ఆలోచించాడు. 'రాక్షస్' అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించాడు. షాప్ పేరుకు ట్యాగ్‌లైన్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చాడు. 'ఖావో కుంభకరణ్ కే జైసా(కుంభకర్ణుడిలా తిను)' అని పెట్టించాడు. కేఫ్ నేమ్ బోర్డ్ చూసిన ఫుడ్ లవర్స్... ఇదేదో బాగుందే అంటూ ఆ రెస్టారెంట్‌కు తెగ వెళ్తున్నారు.
అదే ప్రాంతంలో '53' అనే మరో టేక్అవే కేఫ్ ఉంది. ఇది కూడా అక్కడి ఫుడ్ లవర్స్‌కు సుపరిచితమైన ప్లేసే. 'పోర్టుశ్' కేఫ్ కూడా పేరుతోనే చాలా ఫేమస్ అయ్యింది. బుక్కడ్ బాబా, రేల్ మాఫియా, చుల్హా, నాన్సెన్స్ రెస్టారెంట్ల పేర్లు చూసి కస్టమర్లు కూడా తెగ వెళ్తున్నారు.