TREKKER RESCUED: ట్రెక్కింగ్‌కు వెళ్లి కొండపైన పెద్ద లోయలో చిక్కుకున్న యువకుడిని వైమానిక దళం హెలికాప్టర్ సాయంతో కాపాడింది. ఈ సంఘటన కర్ణాటక, చిక్కబల్లాపూర్ జిల్లాలోని నందగిరిధామ్ సమీప బ్రహ్మగిరి హిల్స్‌పై జరిగింది.
నందగిరిధామ్లో వారాంతపు పర్యటనలను నిషేధించారు అధికారులు. ఈ క్రమంలోనే దిల్లీకి చెందిన నిశాంత్ గుల్లా(19) అనే యువకుడు ఒంటరిగా బ్రహ్మగిరి హిల్స్‌పైకి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. కొండపైభాగంలోకి చేరుకోగానే జారిపడిపోయాడు. సుమారు 250 అడుగుల మేర కింద ఉన్న ఓ లోయలో పడిపోయాడు. భూమిపై నుంచి అది 350 అడుగుల ఎత్తు ఉంటుంది.