తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధికారుల నిర్లక్ష్యం.. పదుల సంఖ్యలో పక్షుల మృత్యువాత.. వీడియో వైరల్​ - కేరళలో వందలాది పక్షుల మృతి

Tree Cutting Kerala : అధికారుల నిర్లక్ష్యం పదుల సంఖ్యలో పక్షులు మరణించేలా చేసింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న చెట్టును యంత్రంతో ఒక్కసారిగా కొట్టేశారు. దీంతో చెట్టుపై ఆశ్రయం పొందుతున్న వందలాది పక్షులు కింద పడి ఆ దెబ్బలకు మరణించాయి.

tree cutting kerala
tree cutting kerala

By

Published : Sep 3, 2022, 7:32 PM IST

చెట్టును నరికేసిన అధికారులు.. పక్షులు బలి

Tree Cutting Kerala : జాతీయ రహదారుల సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) అధికారులు చేసిన అనాలోచిత చర్య వల్ల అనేక పక్షులు మరణించాయి. ఈ దారుణ ఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. రండతనిలో ఓ రోడ్డు విస్తరణను చేపట్టిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును యంత్రం సాయంతో నరికివేశారు. దీంతో చెట్టు ఒక్కసారిగా కిందపడింది. చెట్టుపైన ఆశ్రయం పొందుతున్న అనేక సంఖ్యలో పక్షులు కిందపడి ఆ దెబ్బలకు మృత్యువాతపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనిపై స్పందించిన పీడబ్ల్యూడీ మంత్రి మహ్మద్​ రియాజ్​.. జాతీయ రహదారుల సంస్థ అధికారుల నుంచి వివరణను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు చెట్టు నరికివేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఎడవన్న అటవీ అధికారులు.

పక్షుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి ఫిర్యాదు చేశారు సేవ్​ వెట్​ల్యాండ్స్​ ఇంటర్నేషనల్​ మూవ్​మెంట్​ సంస్థ ప్రతినిధులు. వందలాది పక్షులు మరణించడం బాధాకరమని.. చిన్న పక్షులు గాయపడ్డాయని కనీసం ఎగరలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేముందు.. పక్షులకు సరైన పునరావాస చర్యలు తీసుకోవాలని కోరారు. దశాబ్దానికి పైగా ఉన్న చెట్లు ఉన్నాయని.. వాటిపైనే ఆశ్రయం పొందుతూ వేలాది పక్షులు జీవిస్తున్నాయని.. చెట్లను నరికివేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details