దాతృత్వం చాలా రకాలు. కొందరు పేదలకు వీలైనంత దానం చేస్తారు. మరీ పెద్ద మనుసున్న వారు తోచిన విధంగా కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకుంటారు. కానీ ముంబయికి చెందిన ఒక యువకుడు మాత్రం యాచిస్తున్న పిల్లల కళ్లలో ఆనందం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. యశ్ మనే ఓ యువ వ్యాపారవేత్త ముంబయిలోని ప్రసిద్ధ తాజ్ హోటల్లో ఐదుగురు యాచక పిల్లలకు భోజనం పెట్టించాడు. పిల్లలందరికీ స్వయంగా తానే వంటలు వడ్డించాడు.
రహదారి పక్కన అడుక్కోవడం, పెద్ద భవనాలు, హోటళ్లను.. బయటి నుంచి చూడడం తప్ప లోపలికి వెళ్లడం ఆ పిల్లల ఊహకు కూడా అందని విషయం. అలాంటిది ఆ యువకుడు తమను స్టార్ హోటల్‌కు తీసుకెళ్లడం వల్ల చిన్నారులు ఆశ్చర్యపోయారు. లోపలున్న ఖరీదైన సౌకర్యాలు, సామాగ్రిని చూసి నివ్వెరపోయారు. జీవితంలో ఎన్నడూ తినని రుచికరమైన భోజనం చేసి ముసిరిపోయారు. ప్రత్యేకమైన ట్రీట్ తరువాత, యశ్ పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూసి సంబరపడ్డాడు. ఆ తర్వాత హెటల్ మొత్తం చూపించాడు. వారితో ఫొటోలు దిగాడు.