కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను బ్లాక్, వైట్ ఫంగస్‌లు భయబ్రాంతులకు గురుచేస్తున్నాయి. వీటితో ఒత్తిడికి లోనవుతున్నారు. బ్లాక్ ఫంగస్(Black fungus)తో ప్రధానంగా గుండె, ముక్కు, కళ్లు దెబ్బతింటున్నాయి. బ్లాక్ ఫంగస్‌తో పోలిస్తే.. వైట్ ఫంగస్ ఊపిరితిత్తుతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి ఈ ఫంగస్లకు చికిత్స ఉందా? లేదా? వైద్యులు ఏం చెబుతున్నారు?(Black fungus treatment)
కొవిడ్ బారినపడిన వారిపై పంజా విసురుతోన్న బ్లాక్(Black Fungus), వైట్ ఫంగస్లకు చికిత్స అందుబాటులో ఉందని భావిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే.. అప్రమత్తంగా ఈ విషయంలో ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
"ఫంగస్ అంటే కేవలం ఫంగసే. అది తెలుపు లేదా నలుపు అని కాదు. మ్యూకోర్మైకోసిస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లో నల్లటి మచ్చలు కనిపించటం వల్ల బ్లాక్ ఫంగస్ అంటారు. రంగులు ఇవ్వటం ప్రజలకు అర్థం కావటం కోసమే. తెలుపు ఫంగస్(క్యాండిడియాసిస్) కళ్లు, ముక్కు, గొంతుపై తక్కువగా ప్రభావం చూపుతుంది. నేరుగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఛాతీ, శ్లేష్మ.. హెచ్ఆర్సీటీ ఈ వ్యాధిని గుర్తించేందుకు సాయపడుతుంది.