Transgender Marriage: కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగడం విశేషం.
శ్యామ ఎస్ ప్రభ, మను కార్తిక.. పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్జెండర్ సెల్ కో-ఆర్డినేటర్. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.