ఎంబీబీఎస్ చదువుకుని యాచకవృత్తిని ఎంచుకున్నది తమిళనాడు మధురైకి చెందిన ఓ హిజ్రా. అయితే పురుషుడిగా ఉన్నంత వరకు సాఫీగా సాగిన ఆమె జీవితం.. లింగమార్పిడి చేయించుకున్నాక తలకిందులైంది. గుర్తింపు కరువైంది. దీంతో బతుకుదెరువు కోసం మిగిలిన ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి యాచక వృత్తిలోకి దిగింది. ఇది గుర్తించిన ఆ ప్రాంత పోలీసు అధికారిణి... ఆ హిజ్రాతో క్లీనిక్ ఏర్పాటు చేయడానికి సాయం చేశారు.
ఏం జరిగింది?
మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు ఓ వ్యక్తి. అనంతరం ఓ ఆసుపత్రిలో ఏడాది పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్నాళ్ల తర్వాత మహిళగా మారాలని అనుకున్నాడు. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడు కాస్త.. 'ఆమె'గా మారింది.
ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం కూడా పోయింది. దీంతో అయినవాళ్లు ఆదరించక.. ఇటు ఉద్యోగం లేక అవస్థలు పడింది. దిక్కులేని పరిస్థితిల్లో బతకడానికి ఇతర ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి యాచించడం మొదలుపెట్టింది.