తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రత్యేక ఆకర్షణగా 'ట్రాన్స్​జెండర్​ కేఫ్'​.. కస్టమర్లతో హౌస్​​ఫుల్​! - సర్వర్లుగా ట్రాన్స్​జెండర్లు

Transgender Cafe in Mumbai: చెఫ్​ నుంచి క్లీనింగ్​ వరకు ఆ కేఫ్​లో సిబ్బంది మొత్తం ట్రాన్స్​జెండర్లే. ఆర్డర్​ చేసిన క్షణాల్లోనే కస్టమర్లకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. అదే ముంబయిలోని బాంబే నజరియా కేఫ్​. ఇందులో ట్రాన్​జెండర్లకే ఉద్యోగం కల్పిస్తున్నారు నిర్వహకులు. దానికో ప్రత్యేక కారణం ఉందంటున్నారు.

Bombay Nazariya Cafe
ట్రాన్స్​జెండర్​ కేఫ్

By

Published : Mar 18, 2022, 8:27 PM IST

బాంబే నజరియా కేఫ్​

Transgender Cafe in Mumbai: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు హోటల్​​ నిర్వాహకులు. అలాంటి కోవకే చెందుతుంది బాంబే నజరియా కేఫ్​. ఇది ముంబయి అంధేరి వెస్ట్​జీత్​ నగర్​లోని వెర్సోవాలో ఉంది. ఈ కేఫ్​ ప్రత్యేకత ఏమిటంటారా? ఇందులో పనిచేసేవారు అంతా ట్రాన్స్​జెండర్లే. ఆహార పదార్థాల తయారీ నుంచి డెలివరీ, క్లీనింగ్​ వరకు అన్ని పనులు వారే చేస్తుంటారు. ట్రాన్స్​జెండర్లకు మాత్రమే ఇందులో పనిచేసే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. సమాజంలో వారిపట్ల ఉన్న భావనను మార్చేందుకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

బాంబే నజరియా కేఫ్​ను రెండు నెలల క్రితం డియాగో మిరండా అనే వ్యక్తి ప్రారంభించారు. ట్రాన్స్​జెండర్ల కోసం ఏదైనా చేయాలని మిరండా తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. దీంతో కేఫ్​లో వారికి అవకాశం కల్పిస్తే తన తండ్రి కోరికను నెరవేర్చవచ్చని భావించిన మిరండా.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. హోటల్​ పనుల్లో అనుభవం ఉన్న ట్రాన్స్​జెండర్లను నియమించుకున్నారు.

సిబ్బంది మొత్తం వారే..

ఈ కేఫ్​లో చెఫ్​ నుంచి డెలివరీ, క్లీనింగ్​ వరకు పనిచేస్తున్న సిబ్బంది మొత్తం ట్రాన్స్​జెండర్లే కావడం వల్ల కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పావ్​బాజీ, కీమా పావ్​, మిసాల్​ పావ్​, కశ్మీర్​ పింక్​ టీ వంటివి ఇక్కడ ఫేమస్​.

"నేను ట్రాన్స్​జెండర్​ను. గతంలో నేను హమ్​సఫార్​లో హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశాను. కానీ, నాకు వంటలు చేయటమంటేనే ఇష్టం. అన్ని రకాల వంటలు చేయగలను. అందులో మిస్సాల్​ పావ్​ చాలా బాగా చేస్తాను. దీనిని కస్టమర్లు ఇష్టంగా తింటారు. ఈ కేఫ్​లో ట్రాన్స్​జెండర్​ చెఫ్​ అవసరం ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. నాకు శిక్షణ ఇచ్చి పనిలో చేర్చుకున్నారు."

- సున్యా జాదవ్​, ట్రాన్స్​జెండర్​ చెఫ్​.

ఇక్కడికి వచ్చిన కస్టమర్లు తమను ప్రేమగా పలకరిస్తారని కేఫ్​లో పనిచేసే అక్షరా భాగ్నే తెలిపారు. తాను కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని ఆహారం అందిస్తానని చెప్పారు. ట్రాన్స్​జెండర్ల పట్ల ప్రజల్లో ఉన్న భావనను మార్చేందుకే కేఫ్​కు బాంబే నజరియాగా పేరు పెట్టినట్లు చెప్పారు యజమాని. 'చూసే కోణం మారితే.. ఆలోచన మారుతుంది' అనే తమ నినాదాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.

ఇదీ చూడండి:కాలేజ్​లో ప్రేమ.. ఉద్యోగంలో సహజీవనం.. పెళ్లి అనేసరికి కులం.. పెట్రోల్ పోసి..

ABOUT THE AUTHOR

...view details