బంగారం, నగదు, విలువైన వస్తువులు దొంగతనం చేశారని మనం వినే ఉంటాం. కానీ బిహార్లో దొంగలు మాత్రం వెరైటీగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లారు. దీంతో ఐదు గ్రామాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకుపోయింది.
సివాన్ జిల్లాలోని రఘునాథపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం విచిత్ర ఘటన జరిగింది. సుమారు 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లారు దొంగలు. గ్రామస్థులు ఉదయాన్నే లేచేసరికి గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు మాయమైపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లడం వల్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నేరాలకు పాల్పడేందుకు వీలుగానే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
"ఐదు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. రఘనాథపుర్, బజా, పంజ్వర్, అమ్వారీ, మౌరాపత్తి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటనా స్థలంలో ఓ మోటార్ సైకిల్ లభ్యమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం."