తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం కోసం రైలును ఆపిన అధికారులు.. దిగి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు - Nitish Kumar Samadhan Yatra

సీఎం కాన్వాయ్​ వస్తుందని 15 నిమిషాల పాటు రైలును​ నిలిపేశారు. దీంతో ప్రయాణికులు రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

trains-stopped-to-pass-cm-nitish-kumar-convoy-in bihar
నీతీశ్​​ కాన్వాయ్​ కోసం 15 నిమిషాల పాటు ఆగిన రైలు

By

Published : Jan 18, 2023, 10:03 PM IST

బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​ కాన్వాయ్​ వస్తుందని 15 నిమిషాల పాటు రైలు​ను ఆపారు. దీంతో విసిగెత్తిపోయిన ప్రయాణికులు రైలు దిగి వెళ్లిపోయారు. బక్సర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈస్ట్ ఇటాడి రైల్వే క్రాసింగ్​ వద్ద ఇలా రైలును ఆపారు. దీనిపై రైల్వే అధికారులు ఎటువంటి సృష్టతను ఇవ్వలేదు.
వివరాల్లోకి వెళితే..
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​​.. బుధవారం రోడ్డు మార్గం గుండా బక్సర్​ జిల్లాకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా యాత్ర చేస్తున్న నీతీశ్​.. ఇందులో భాగంగా బక్సర్ జిల్లా పర్యటనకు వచ్చారు. సీఎం కాన్వాయ్​ ఈస్ట్ ఇటాడి రైల్వే గుంటి క్రాసింగ్​ వద్దకు​ రాగానే.. రైల్వే గేట్​ మ్యాన్ దాదాపు 15 నిమిషాల పాటు రైలును ఆపాడు. రైలు చాలా సేపు ఆగడం వల్ల ప్రయాణికులు దిగి కాలి నడకన వెళ్లిపోయారు. సీఎం వస్తున్నందునే రైలును ఆపినట్లు రైల్వే గేట్​ మ్యాన్ తెలిపారు.

బక్సర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నీతీశ్​.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పథకాలను పరీశీలించారు. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మహాదళిత్​ బస్తీని సందర్శించారు. బక్సర్‌లోని హెన్వా వద్ద ఉన్న చెరువును, కత్తర్‌లో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం ఆసక్తిగా తిలకించారు. నూతన కౌన్సిల్​ భవనానికి శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details