కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సైనిక నియామక ప్రక్రియ 'అగ్నిపథ్'. దేశంలో తొలిసారిగా ఈ పథకం ద్వారా ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు కర్ణాటకలోని బెళగావిలోని సాంబ్రా వైమానిక సెంటర్లో ఆదివారం శిక్షణ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు దాదాపుగా 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,850 మంది అగ్నివీర్ వాయు పోస్టుకు ఎంపికయ్యారు. వీరికి ఆరు నెలలపాటు బెళగావి ఎయిర్‌ఫోర్స్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన మళ్లీ సర్వీసులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు.
'అగ్నివీర్' అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభం.. 2,850 మందికి ఆరు నెలల శిక్షణ
అగ్నిపథ్ పథకం ద్వారా వైమానిక దళానికి ఎంపికైన అభ్యర్థులకు బెళగావిలో సైనిక శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 2,850 మంది ఆరునెలల పాటు ఈ ట్రైనింగ్ తీసుకోనున్నారు.
అగ్నిపథ్
'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 14న ప్రకటించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తామని పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం తెలిపింది.