Train Derailment: ఛత్తీస్‌గఢ్ దంతెవాడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. కిరండోల్-విశాఖ రైల్వే లైనులో 17 బోగీలతో వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు అదుపు తప్పింది. దీంతో బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
చెల్లచెదురుగా పడిన రైలు బోగీలు ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా భాన్సీ-కమలూర్ స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 4.05 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైల్వే లైనుకు అడ్డుగా పడిన బోగీలు నక్సలైట్ల హస్తం ఉందా?
ఈ ఘటన వెనుక నక్సలైట్లు ప్రమేయం ఉన్నట్లు అధికారులు తొలుత భావించారు. అయితే నక్సల్స్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకపోడం వల్ల వారి హస్తం లేనట్లు నిర్ధరించుకున్నారు.
"ఈ ప్రమాదం యాంత్రిక కారణాల వల్ల జరిగింది. ఘటనా స్థలంలో మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కదలికలు కనిపించలేదు. ప్రమాదం వెనుక నక్సల్స్ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని అభిషేక్ పల్లవ తెలిపారు. రైల్వే సిబ్బంది విచారణ తర్వాతే ఘటనకు కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.
జిల్లా రిజర్వు గార్డ్(డీఆర్జీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ట్రాక్ పునర్నిర్మాణ పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి:తమ పొలంలోకి నీళ్లు రానివ్వొద్దన్నందుకు కాల్పులు- ఇద్దరు మృతి