Train delayed by a year: అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఓ గూడ్స్ రైలు ఏడాది ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ఫలితంగా పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలు పాడైపోయాయి. ఝార్ఖండ్ గిరీడీలో జరిగిన ఈ ఘటన రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
762 కి.మీ.. ఏడాది ప్రయాణం:ఈనెల 17న ఝార్ఖండ్‌లోని ఓ న్యూ గిరీడీ స్టేషన్‌కు ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఒక బోగీలోని సరకును అన్లోడ్ చేసుకోవాల్సిందిగా స్టేషన్ సిబ్బందికి సమాచారం అందింది. షెడ్యూల్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన ఈ బోగీని చూసి వారు నివ్వెరపోయారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బియ్యం లోడు ఆ బోగీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత న్యూ గిరీడీ స్టేషన్ సిబ్బందికి అసలు విషయం అర్థమవగా.. వారంతా షాకయ్యారు.ఎందుకంటే.. ఆ రైలు బోగీ గతేడాదే రావాల్సి ఉంది.