తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి - పీ-305 నౌకలో 26 మంది మృతి

తౌక్టే తుపాన్ ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీనౌక పీ-305లో చిక్కుకున్న వారిలో 26 మంది మృతి చెందారు. గల్లంతైన 49 మంది కోసం నౌకదళ సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు... రక్షణ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

barge accident
గల్లంతైన భారీనౌ

By

Published : May 19, 2021, 10:42 PM IST

తౌక్టే తుపాన్ ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీనౌక పీ-305లో చిక్కుకున్న వారిలో 26 మంది మృతి చెందారు. ఈ మేరకు 26 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గల్లంతైన 49 మంది కోసం నౌకదళ సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు... రక్షణ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

తౌక్టే తుపాన్ ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీనౌక పీ-305లో 261 మంది చిక్కుకున్నారు. వారిలో 186 మందిని రక్షించారు. ఇవాళ 26 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు 125మందిని, ఇవాళ లభించిన 26 మృతదేహాలను ఐఎన్​ఎస్ కొచి బుధవారం ముంబయికి తీసుకొచ్చింది. మరో 49మంది ఆచూకీ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు నౌకాదళం తెలిపింది. సహాయ చర్యల్లో ఐఎన్​ఎస్ టెగ్, ఐఎన్​ఎస్​ బెత్వా, ఐఎన్​ఎస్​ బియాస్ సహా పీ81 యుద్ధ విమానం పాల్గొంటున్నాయి.ముంబయికి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో చమురు క్షేత్రాలు ఉన్నాయి. కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు నౌకలు, ఒక చమురు క్షేత్రంలోని 707 మంది సిబ్బంది చిక్కుకున్నారు. అందులో గాల్ కన్‌స్ట్రక్టర్‌ అనే నావలో చిక్కుకున్న 137 మందిని నౌకాదళం.. మంగళవారమే ఒడ్డుకు చేర్చింది. ఎస్ఎస్-3 నౌకలోని 196మంది,చమురుక్షేత్రం సాగర్ భూషణ్ లోని 101 మంది సైతం.... సురక్షితంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమయం గడుస్తుండటంతో గల్లంతైన 49మంది ఎలా ఉన్నారో అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వారిని సురక్షితంగా తీసుకొస్తామని నౌకాదళ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:గుజరాత్​కు మోదీ ప్రభుత్వం 1000కోట్ల ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details