తెలంగాణ

telangana

By

Published : May 23, 2021, 5:43 PM IST

Updated : May 23, 2021, 6:04 PM IST

ETV Bharat / bharat

షూ లేకుండా బైక్​ నడిపితే ఫైన్​-​ మీకు తెలుసా?

భారత దేశంలో ఘా లేకుండా ద్విచక్ర వాహనం నడపడం నేరం. ఇలా చేయడం ట్రాఫిక్​ నిబంధనల ఉల్లంఘనే. 2019లో మోటార్​ వాహన చట్ట సవరణ తర్వాత.. కేంద్రం ఇలాంటి నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే ఎందుకు ఫైన్​ పడుతుంది? అసలు ఈ నియమం ఎప్పటి నుంచి అమల్లో ఉంది?

Traffic Police To Fine
షూ లేకుండా బైక్​ నడిపితే ఫైన్​

షూ లేకుండా మీరు ద్విచక్రవాహనం నడుపుతున్నారా? అయితే ట్రాఫిక్​ నిబంధనల ప్రకారం మీకు రూ.1000 ఫైన్​ పడ్డట్టే.

పాదాలు కనపడేటట్లు పాదరక్షలు ధరించి బైక్​ నడపడం నేరమని చెబుతోంది మోటార్​ వాహనాల చట్టం. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా.. అమలుకు నోచుకోలేదు. అయితే 2019లో మోటార్​ వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్రం ప్రభుత్వం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

షూ లేకుండా బైక్​ నడిపితే ఫైన్​

చెప్పులతో ద్విచక్రవాహనం నడిపితే ఏమవుతుంది? ఆ నిబంధనన ఏం చెబుతుందో తెలుసుకుందాం.

  • చెప్పులకు తగినంత పట్టు ఉండదు. కాబట్టి బైక్​ గేర్​ మార్చేటప్పుడు పట్టు తప్పుతుంది. రద్దీగా ఉండే ప్రదేశంలో ప్రమాదం జరగొచ్చు.
  • ప్రమాదవశాత్తు కింద పడితే పాదాలకు చెప్పులు రక్షణ ఇవ్వలేవు. ఫలితంగా గాయాలు అవుతాయి.
  • బైక్​ రైడింగ్​ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు, ఇతరత్రా వస్తులు ధరించకపోయినా ఫర్వాలేదు. కానీ నాణ్యమైన హెల్మెట్​, షూ తప్పనిసరి.

దేశంలో వాహనదారుల్లో క్రమశిక్షణను అలవర్చేందుకు మోటార్​ వాహనాల చట్టాన్ని 2019లో సవరించింది కేంద్రం. వేర్వేరు నేరాలకు జరిమానాలను పదింతలు పెంచింది. వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించడానికి ఇది ఒక్కటే మార్గమని భావిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి:బైక్​ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!

Last Updated : May 23, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details