Toy Train Derailed: సేవలు ప్రారంభించిన కొద్ది సేపటికే ఓ చిల్డ్రన్ ట్రైన్ పట్టాలు తప్పింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో రైలులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ఉన్నారు. కర్ణాటక హుబ్బళ్లిలోని ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్స్‌లో శనివారం.. పిల్లల రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పడంపై మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రారంభం రోజే పట్టాలు తప్పిన రైలు.. మంత్రికి తప్పిన ప్రమాదం!
Toy Train Derailed: కర్ణాటకలోని హుబ్బళ్లిలో చిల్డ్రన్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రైలును ప్రారంభించిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. హుబ్బళ్లి-ధార్వాద్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.4.2 కోట్ల వ్యయంతో ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్లో ఈ చిల్డ్రన్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.
karnataka
హుబ్బళ్లి-ధార్వాద్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.4.2 కోట్ల వ్యయంతో ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్లో ఈ చిల్డ్రన్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఈ రైలు సేవలను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా రైలులో ప్రయాణించారు. కానీ రైలు కొంత దూరం వెళ్లాక పట్టాలు తప్పడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి :అత్యాచారం విఫలయత్నం.. రైలు నుంచి యువతిని తోసేసి..