తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచు కురిసె.. పర్యటకులు మురిసె... - మంచు కురవంగా.. పర్యటకులు మురవంగా

హిమాచల్​ ప్రదేశ్​ను మంచు ముంచెత్తుతోంది. ఎటు చూసినా శ్వేత వర్ణంతో.. అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ అందాలను తిలకించేందుకు పర్యటకులు తరలివస్తున్నారు.

Tourists in kufri during snowfall in himachal pradesh
మంచు కురవంగా.. పర్యటకులు మురవంగా

By

Published : Nov 26, 2020, 4:57 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్-స్పితి జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా శ్వేత వర్ణంతో స్వర్గధామంలా కనువిందు చేస్తోంది.

రషెల్​ గ్రామంలోని ఇళ్లపై మంచు ఆవరించింది. గురువారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తోంది.

లాహౌల్-స్పితిలోని రషెల్​ గ్రామంలో ఇళ్లను కప్పేసిన మంచు

కుల్లు జిల్లాలోని జాలోరి కనుమలో మంచు అధికంగా కురుస్తోంది.

జాలోరి కనుమలో హిమపాతం

సిమ్లాలోని కుఫ్రీ ప్రాంతంలో హిమపాతం భారీగా కురుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల చలి పెరిగింది. గుజరాత్ నుంచి వచ్చిన కొందరు పర్యటకులు.. మొదటిసారిగా ఈ హిమపాత దృశ్యాలను చూసి ఆనందానికి లోనవుతున్నారు.

కుఫ్రీని కమ్మేసిన మంచు
మంచులో కుఫ్రీ

మంచు వల్ల పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయ చర్యల్ని చేపడుతున్నారు.

ఇదీ చూడండి:పిల్లలతో పులి కేరింతలు- పర్యటకులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details