నదిలో కొట్టుకుపోయిన టూరిస్ట్ కారు.. 9 మంది జలసమాధి.. ఒక్కరు సేఫ్! - dhela river car washed wa
नैनीताल के रामनगर से बड़ी खबर सामने आ रही है. जहां ढेला नदी में पर्यटकों से भरी अर्टिगा कार बह गई है. हादसे के समय कार में कुल 9 लोग सवार थे. जिनमें से चार के शव बरामद कर लिए गए हैं.
08:45 July 08
నదిలో కొట్టుకుపోయిన టూరిస్ట్ కారు.. 9 మంది జలసమాధి.. ఒక్కరు సేఫ్!
Tourist Car Washed Away In River: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల ధాటికి రామ్‌నగర్‌లోని ధేలా నది పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం.. పర్యటకులతో వెళ్తున్న ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ బాలికను స్థానికులు కాపాడారు.
సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో స్థానికంగా నివసిస్తున్న కొంతమందితో పాటు పంజాబ్‌కు చెందిన పర్యటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
'అతివేగమే కారణం'.. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్డీఎం గౌరవ్ చట్వాల్.. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామన్నారు.