తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టూరిస్టు బస్సు బోల్తా పడి ఆరుగురు మృతి.. 30 మందికి గాయాలు - బస్సు ప్రమాదం

టూరిస్ట్​ బస్సు
టూరిస్ట్​ బస్సు

By

Published : May 25, 2022, 8:23 AM IST

Updated : May 25, 2022, 8:54 AM IST

08:13 May 25

టూరిస్టు బస్సు బోల్తా పడి ఆరుగురు మృతి

ఒడిశాలోని గంజామ్​-కంధమల్​ సరిహద్దు వద్ద టూరిస్ట్​ బస్సు బోల్తా పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కళింగ ఘటి ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. దారింగ్​బడి నుంచి బంగాల్​కు ఈ బస్సు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

బ్రేక్​ ఫేల్యూర్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిలో 14 మందిని బెర్హమ్​పుర్​లోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించగా.. మరో 16 మందిని భంజానగర్​ ఆసుపత్రిలో చేర్చారు.

Last Updated : May 25, 2022, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details